విశాలాంధ్ర,సీతానగరం: పార్వతీపురం ఎంఎల్ఏ బోనెల విజయ్ చంద్ర సూచనలు మేరకు విజయవాడ తుఫాన్ బాధితులకు పలు గ్రామాల టీడీపీ నేతలు స్పందించి సహాయాన్ని అందిస్తున్నాని మండల టీడీపీ నేతలు పెంట సత్యంనాయుడు, రౌతు వేణుగోపాలనాయుడులు తెలిపారు. ఇప్పటికే ఎంఎల్ఏ విజయ్ చంద్రకు మాజీ జడ్పీటీసి తెంటు వెంకటఅప్పలనాయుడు రూ.25వేలును అందజేయగా,బుదవారం నాడు బక్కుపేట సర్పంచ్ గొట్టాపు అప్పారావు మంగమ్మలు 10వేలు రూపాయలు, గెడ్డలుప్పి నుండి టీడీపి నాయకుడు కర్రి శంకరరావు 10వేలు రూపాయలు, చెల్లంనాయుడువలస సర్పంచ్ వాకాడ పారినాయుడు,గ్రామస్తులు కలిపి 22వేల 500రూపాయలు, లక్ష్మిపురం టీడీపి నాయకులు 15వేలరూపాయలు, తామర ఖండి గ్రామానికి చెందిన టీడీపీనేత సోమిరెడ్డి రమేష్ 10వేలును నగదు రూపంలో విరాళంగా అందజేశారు.మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందించాలని కోరారు.