విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ కు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పూలబొకేను అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలోని వైద్య ఆరోగ్య పనితీరును వివరించారు. మంత్రితో పాటు జిల్లా విచ్చేసిన వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సి.హరికిరణ్, సెకండరీ హెల్త్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తదితర రాష్ట్ర అధికారులకు కూడా స్వాగతంపలికారు