విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని 35 గ్రామపంచాయతీల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న శిక్షణతరగతులు బుధవారంతో ముగిసినట్లు ఎంపీడీవో కుమార్ తెలిపారు. మూడు రోజులనుండి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాల్లో గ్రామ పంచాయతీల పరిపాలన విధానంపైన చెత్త సంపద కేంద్రాల నిర్వహణపైన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక పై పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకొని పంచాయతీలను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామపంచాయతీలో ఉండే చెత్త సంపద కేంద్రాలను సద్వినియోగం గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పొడి చెత్త తడి చెత్త సేకరణతో పాటు పారిశుధ్యం తొలగించాలని కోరారు.గ్రామపంచాయతీ సమావేశాలు నిర్వహణ, గ్రామసభలు నిర్వహణపై కూడా ఇటువంటి శిక్షణా తరగతుల వలన అవగాహన పెంచు కోవాలన్నారు. రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణలలో పంచాయతీరాజ్ చట్టంపై పలు అంశాలను వివరించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న పథకాల గురించి కూడా వివరించడం జరిగిందన్నారు. గ్రామసభలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు పైన, గ్రామస్థాయిలో ఉండే అన్ని శాఖలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రెవెన్యూపరమైన అంశాల పైన తహాసిల్దార్ రాములమ్మ చక్కగా వివరించారు. రెవెన్యూా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ర్యక్రమంలోఎంపీపీ ప్రతినిధి శ్రీరాములునాయుడు, పరిపాలనాధికారి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు,
రిసోర్స్ పర్సనులు శశి భూషణరావు, మనోహర్, శ్రీనివాసరావు, పీటర్, సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈశిక్షణా తరగతుల వలన ఎన్నో అంశాలను నేర్చుకోవడం జరిగిందని సర్పంచులు తెలియజేశారు