టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇజ్రాయెల్‌కి చెందిన సెనియా పోలికర్పోవాపై వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు.. అదే జోరులో బుధవారం హాంకాంగ్ షట్లర్ చెంగ్‌పై విజయం సాధించింది.మహిళల సింగిల్స్‌లో భాగంగా చెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. తొలి సెట్‌ని 21-9తో అలవోకగా పీవీ సింధు..చేజిక్కించుకుంది. 21-16తో రెండో సెట్‌ని గెలవడం ద్వారా రౌండ్-16లోకి ప్రవేశించింది.