రెండో టీ20 వాయిదా
భారత్ – శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడిరది.టీమిండియా ప్లేయర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా నేడు జరగాల్సిన భారత్, శ్రీలంక రెండో టీ20 వాయిదాపడిరది. ఈ క్రమంలో ఇరు జట్లు ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇక టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే బుధవారం మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది.