ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో పాల్గొనే భారత షూటింగ్ జట్టు నేడు టోక్యో చేరుకుంది.క్రొయేషియాలోని జాగ్రెబ్ బేస్ నుంచి నిన్న భారత షూటింగ్ జట్టు ఆమ్‌స్టెర్‌డామ్ చేరుకుంది. ఈ జట్టులో ప్రముఖ షూటర్లు అయిన సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అంజుమ్ మౌద్గిల్ తదితరులు ఉన్నారు. మొత్తం 18 క్రీడా విభాగాల్లో 126 మంది భారత క్రీడాకారులు పాల్గొంటారు.