పతకంపై చిగురించిన ఆశలు
క్వార్టర్స్‌లో సింధు, సతీష్‌కుమార్
హాకీ జట్టుకూ క్వార్టర్స్ బెర్త్ ఖరారు..!
ర్చరీ, షూటింగ్ లోనూ రాణింపు
టోక్యో : ఒలింపిక్స్‌లో గురువారం భారత్‌కు సానుకూల ఫలితాలు వచ్చాయి. అథ్లెట్లు అదరగొట్టారు. పోటీపడిన అన్ని క్రీడాంశాల్లో మెరుగైన ప్రదర్శనతో పతకాలపై ఆశలు రేపుతున్నారు.. హాకీ పూల్-ఏ లో మెరుగైన స్థానంతో భారతజట్టు దాదాపుగా క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోగా, షటిల్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో సతీశ్‌కుమార్ క్వార్టర్స్‌కు చేరారు. ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతానుదాస్.. ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. షూటింగ్ మహిళల 25 మీ. పిస్టల్ విభాగంలో తొలి క్వాలిఫికేషన్ ప్రెసిషన్ రౌండ్‌లో మను బాకర్ ఐదో(5వ) స్థానంలో నిలిచింది. మరో షూటర్.. రహి సర్నోబత్ 25వ స్థానంలో ఉంది. వీరు శుక్రవారం జరిగే ర్యాపిడ్ ఫైర్‌లోనూ(క్వాలిఫికేషన్?-స్టేజీ 2) తలపడాల్సి ఉంటుంది.మొత్తంగా టాప్-8లో నిలిచిన షూటర్లు.. పతకం కోసం జరిగే ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. కాగా పతకం తెస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న స్టార్ బాక్సర్ మేరీకోమ్ ప్రీక్వార్టర్స్‌లో ఓటమి చెందడం భారత్‌కు ఎదురు దెబ్బ.
సింధు దూకుడు..
ఒలింపిక్స్‌లో స్వర్ణపతకంపై గురిపెట్టిన భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి మియా బ్లిక్‌ఫెల్ట్‌ను వరుస సెట్లలో చిత్తు చేసింది. ఎప్పటిలాగే మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. మొదటి సెట్‌ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్‌ను మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. క్వార్టర్స్‌లో సింధు.. జపాన్ షట్లర్ అకానె యమగూచితో ఆడనుంది.
హాకీలోనూ అర్జెంటీనాపై విజయం
హాకీలో భారతజట్టు దూసుకుపోతోంది. పూల్‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండిరగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 3-1 గోల్స్ తేడాతో ఓడిరచింది. 43వ నిమిషంలో కుమార్ వరుణ్ భారత్‌కు తొలి గోల్ కొట్టాడు. ఆ తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్ (58వ ని॥), హర్మన్ ప్రీత్ సింగ్?(59వ ని॥) గోల్స్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచారు. అర్జెంటీనాకు ఏకైక గోల్ 48వ నిమిషంలో.. పెనాల్టీ కార్నర్ రూపంలో లభించింది. ఈ విజయంతో భారత్ జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే. ఏ పూల్‌లోని ఆరుజట్లలో నాలుగు జట్లు క్వార్టర్స్‌కు చేరుతాయి. ప్రస్తుతం 3 మ్యాచ్‌లు గెలిచిన భారతజట్టు ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఛాంపియన్‌కు షాకిచ్చిన అతాను..
భారత ఆర్చర్ అతాను దాస్ పురుషుల వ్యక్తిగత విభాగంలో సంచలన విజయంతో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. 1/32 ఎలిమినేషన్స్‌లో చైనీస్ తైపీకి చెందిన డెంగ్‌యు- చెంగ్‌ను 6-4 తేడాతో ఓడిరచిన అతాను.. తర్వాతి మ్యాచ్‌లో దక్షిణ కొరియా అగ్రశ్రేణి క్రీడాకారుడు, రెండుసార్లు ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత ఓ జిన్ హయక్‌పై షూట్-ఆఫ్‌లో నెగ్గి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశిం చాడు. అతాను దాస్ తర్వాతి మ్యాచ్‌లో జపాన్?కు చెందిన ఫురుకవా తకహరూతో పోటీ పడనున్నాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం హోరా హోరీగా సాగింది. ఇద్దరూ ఐదేసి పాయింట్లు సాధించగా .. షూట్-ఆఫ్‌లో ఓ జిన్ 9 స్కోరు చేశాడు. అతాను బాణం గురి తప్పలేదు.. 10 పాయింట్లు సాధించి.. మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.
పతకానికి అడుగుదూరంలో సతీశ్ కుమార్
విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీష్ కుమార్ గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జమైకన్ బాక్సర్‌ను కంగుతినిపించాడు. పురుషుల సూపర్ హేవీవెయిట్ 91 కేజీల విభాగంలో జమైకా బాక్సర్ రికార్డో బ్రౌన్‌పై సతీష్ 4-1 తేడాతో విజయం సాధించాడు. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఆదివారం ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బఖోదీర్ జలొ లొవ్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్‌కు వెళ్తే సతీష్‌కు పతకం ఖాయం అవుతుంది. సెమీస్‌లో ఓడిన కాంస్యం ఖాయం.
మళ్లీ మనుపై ఆశలు..
షూటింగ్ మహిళల 25. మీ. పిస్టల్ విభాగంలో మను బాకర్ ఆకట్టుకుంది. క్వాలిఫికేషన్ ప్రెసిషన్ రౌండ్‌లో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం 300 పాయింట్లకు.. 292 సాధించింది. కాగా మరో షూటర్ రహీ సర్నోబత్.. 30 షాట్లకు 287 పాయింట్లతో 25వ స్థానంలో ఉంది. శుక్రవారం క్వాలిఫికేషన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరగనుంది. మొత్తంగా టాప్-8లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
మేరీ కోమ్ ఓటమి
పతకం తెస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న భారత అగ్రశ్రేణి బాక్సర్ మేరీకోమ్ ఓటమి పాలైంది. 48-51 కేజీల కేటగిరీలో కొలంబియాకు చెందిన వాలెన్సియాతో కోమ్ తలపడిరది. ఈ ఫైట్‌లో నలుగురు జడ్జిలు వాలెన్సియాకు అను కూలంగా మార్కులివ్వగా, ఒకరు మేరీకోమ్‌కు ఇచ్చారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన వాలెన్సియా 3-2తో విజయం సాధించింది. దీంతో బాక్సింగ్‌లో పతకం ఖాయ మనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది. కాగా, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కు ఇదే చివరి ఒలింపిక్. కాగా, ఓటమి అనంతరం మేరీకోమ్ భావో ద్వేగానికి లోనైంది. వయసు సహక రించేంత వరకు రిటైర్మెంట్ ప్రకటించబోనని పేర్కొంది.