ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో భారత్ ఓటమిపాలైంది. దీంతో తొలిసారిగా ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది.ఈ ఓటమితో భారత మహిళల జట్టు కాంస్య పతకం కోసం ఆగస్టు 6న బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.రాణీ రాంపాల్ సేన..పురుషుల జట్టు బాటలోనే నడుస్తూ రజతం, స్వర్ణం గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. తొలి క్వార్టర్ ఆదిలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్‌కు శుభారంభం చేసింది. అయితే అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు. దీంతో..భారత మహిళల హాకీ టీం ఓటమి చవిచూడాల్సి వచ్చింది.