టోక్యో : ఒలింపిక్స్`2020 బాక్సింగ్‌లో రజత పతకం సాధించి సోమ వారం స్వదేశానికి తిరిగొచ్చిన మీరాబాయి చానుకు దిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆమె రాక సందర్భంగా అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 49 కేజీల విభాగంలో బరిలో దిగిన మీరాబాయి మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజతపతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరవగలిగింది.
చానుకు ఏఎస్పీ ఉద్యోగం..
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన చానుకు.. ఇప్పటికే సొంత రాష్ట్రమైన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రూ.కోటి నగదు పుర స్కారం ప్రకటించారు. అయితే స్వరాష్ట్రానికి రాగానే మరో బహుమతి ఇస్తామని చెప్పారాయన. తాజాగా చానుకు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా ఉద్యోగం ఇస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
అదే జరిగితే చానుకు స్వర్ణం దక్కే అవకాశం..!
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం పతకం సాధించి కోట్లాదిమంది భారతీయుల అభిమానాన్ని కొల్లగొట్టిన మీరాబాయి చాను ఆనందం రెట్టింపయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ వెయిట్‌లిఫ్టర్‌కు అంతా అనుకున్నట్లు జరిగితే స్వర్ణపతకం దక్కే అవకాశముంది! చాను పోటీపడిన 49 కేజీల విభాగంలో స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌ల్లో 210 కేజీల బరువును ఎత్తి కొత్త ఒలింపిక్స్ రికార్డును సృష్టించిన చైనా రెజ్లర్ జిహుయ్ హౌ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అయితే ఆమెను యాంటీ డోపింగ్ అధికా రులు పరీక్షించ నున్నారు. అప్పటివరకు ఆమెను ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఒకవేళ ఆమె డోపీగా తేలితే హౌ పతకాన్ని వెనక్కి తీసుకుంటారు. రెండో స్థానంలో ఉన్న చానుకు స్వర్ణపతకం లభించడం ఖాయం. ఇక మూడో స్థానంలో ఉన్న ఇండోనేసియా రెజ్లర్‌కు రజత పతకం దక్కే అవకాశం ఉంది. స్నాచ్‌లో 84 కేజీలతో పాటు క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కేజీల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచింది చాను. దీంతో ఆమెకు రజతం దక్కింది. విండీ కంటిక ఐసా(ఇండోనేసియా) 194 కేజీల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచింది.