విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణములోని శివరామ నగర్ లో నివసిస్తున్న ఓలేటి రమేష్ నాయుడు అనే చేనేత కార్మికుడు (44) గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఇలా వెళితే ధర్మవరమునకు బ్రతుకుతెరువు కోసం మండల పరిధిలోని ఓబుల నాయన పల్లి గ్రామం నుండి గత ఐదు సంవత్సరాల కిందట ధర్మవరంలో చేనేత కార్మికులుగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడని తెలిపారు. అయితే మంగళవారం ఉన్నపలంగా చాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యమును అందించుకున్న తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురమునకు ధర్మవరం ప్రభుత్వ వైద్యులు పంపగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఓలేటి ప్రభావతి, కుమార్తె మేఘన, కుమారుడు సాయి కుమార్ ఉన్నారు. మేఘన బెంగళూరులో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోందని, కుమార్తె విజయవాడలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.