విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో మానవతా సంస్థ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన సభ్యులందరూ కలిసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా సి.చిన్నప్ప, ఉపాధ్యక్షులుగా జగ్గా వేణుగోపాల్, కార్యదర్శిగా సిఎస్. మంజునాథ్, సంయుక్త కార్యదర్శిగా టి. రామకృష్ణ, కోశాధికారిగా ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్లుగా బి. రామకృష్ణ, కే. సాయి ప్రసాద్, జె. నరసింహారెడ్డి, జి. ఆంజనేయ చౌదరి, జి. మనోహర్ గుప్తా, పి. రాంప్రసాద్, గట్టు వెంకటేష్, ఎం. విజయభాస్కర్ (శివ), టి. నారాయణ రెడ్డి, ముఖ్య సలహాదారులుగా జింక చిన్నప్ప ఎంపిక కావడం జరిగింది. ఇంతకు మునుపు ఉన్న అధ్యక్షులు తల్లం నారాయణమూర్తిని మానవతా సెంట్రల్ కమిటీ వారికి ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. ఎంపికైన నూతన కమిటీ వారు మాట్లాడుతూ మానవతా సంస్థ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని, పేద ప్రజలకు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.