విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్ చార్జ్ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు ఆదేశాల మేరకు ఓ ఎస్ డి వీసీ గా ఆచార్య ఎన్. దేవన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇంచార్జ్ ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య నాపై నమ్మకం ఉంచి ఈ భాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయం అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య కే.బి. చంద్ర శేఖర్ , ఆచార్య జి.వి. సుబ్బా రెడ్డి , యూనివర్సిటీ డైరెక్టర్లు, భోధన , భోధనేతర సిబ్బంది, ఔట్సొర్సింగ్ సిబ్బంది పలువురు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.