డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హుస్సేనప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, పార్థసారధి నగర్ లో గల అరుణ్ చిన్నపిల్లల ఆసుపత్రి పక్కనే భవాని టింబర్ డిపో ఉండటం వల్ల డాక్టర్ సుధాకర్ తో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులు కూడా పలు ఇబ్బందులు పడేవారు. అంతేకాకుండా టింబర్ డిపో ద్వారా వచ్చే చెక్కపొట్టు వాతావరణంలో కాలుష్యం గా మారి ప్రజల ఊపిరితిత్తుల కు ఆరోగ్య సమస్యలు కూడా తేవడం జరుగు తున్నది.టింబర్ డిపో యజమానికి డాక్టర్ సుధాకర్ పలుమార్లు ఈ డిపోను తొలగించాలని తెలిపిన కూడా, ఎటువంటి స్పందన రాకపోవడంతో డాక్టర్ పలువురు అధికారులతో పాటు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు స్వయంగా ఫిర్యాదు చేశా రు. దీంతో జిల్లా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హుస్సేనప్ప తో పాటు బీట్ ఆఫీసర్ అక్కులప్ప కూడా మంత్రి, జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆసుపత్రి ఆవరణం, టింబర్ డిపో ఆవరణాన్ని వారు నిశితంగా పరిశీలించారు. అనంతరం టింబర్ డిపో నుంచి వచ్చే చెక్క పౌడర్ తోపాటు, డిపో ఆవరణమంతా పెద్దపెద్ద మొద్దులు ఉండడం, విష పురుగులు పాములు రావడానికి అవకాశం ఉందని వారు గుర్తించారు. ఇలాంటి సమయాల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు పలు ఇబ్బందులు వస్తున్నాయని వారు గ్రహించారు. దీంతో ఆసుపత్రిని, చిన్నపిల్లల, రోగులను, ఆసుపత్రికి వచ్చే రోగుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నివేదికను తయారుచేసి, జిల్లా ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు. తదుపరి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, టింబర్ డిపోకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుందని, ఆ నోటీసులకు స్పందించకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ క్లినిక్ – డాక్టర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.