ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించిన ధర్మవరం పట్టణ టిడిపి రజక సాధికార కమిటీ సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం; తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రజక సాధికార సమితి హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ మాల్యవంతం నారాయణస్వామి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా గుడి వెనుకలగన గల శ్రీ గంగమ్మ గుడి వద్ద రజక సాధికార సమితి సభ్యుల ఆధ్వర్యంలో కీ”శే” తెలంగాణ వీరనారి శ్రీ చిట్యాల చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో
భూమి కోసం , భుక్తి కోసం ,వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు , భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించకపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు . ఈ సాయుధ పోరాటంలో తన కుటుంబాన్ని కోల్పోయిన కూడా ఎక్కడ అధైర్య పడకుండా తన పోరాటాన్ని కొనసాగించారు ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది . తన ఇంటిని కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ గా చేసి ఎన్నో సమస్యలపై పోరాడారు.. “” భాంచన్ కాల్మొక్తా “” అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారని ఆమెను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకులేటి నరసింహులు , గంగమ్మ గుడి అధ్యక్షులు కృష్ణాపురం మస్తానప్ప , మాల్యావంతం వెంకటేశులు , గోట్లూరు రామకృష్ణ ,కొత్తకోట రామంజి, గంగరాజు , వెంకట్ రాముడు ,రాధాకృష్ణ, రమేష్ , గణేష్, తుంపర్తి వెంకటేష్ , అక్కులప్ప , శ్రీనివాసులు , నాగరాజు , భాస్కర, కళ్యాణ్, నారాయణస్వామి, కృష్ణ, రామాంజనేయులు, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు…