విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరం జామియా మసీద్ కమిటీ, మత పెద్దల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో మహబూబ్ భాష (కలా) ప్రెసిడెంట్ గా, వైస్ ప్రెసిడెంట్ గా షబ్బీర్ (మొబైల్), సెక్రటరీ గా ఇస్మాయిల్, వైస్ సెక్రెటరీ గా అరిఫ్లను ఎన్నుకున్నారు. కమిటీ మెంబర్లుగా సాజిద్, సాధిక్,అబుజర్,ఆఫ్వాన్,జాకీర్,ఉస్మాన్,షకీల్, రహీం, సయ్యద్, షమీ,అబ్బు,టీప్పు,మొహమ్మద్, ఇమ్రాన్, ఇర్ఫాన్, హుస్సేన్, తయ్యబ్, షాకీర్,షేక్షవలి, జుబేర్, అజ్మతుల్లా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కులమత బేధాలు లేకుండా అందరికీ అండగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు ముతవల్లి ,అబ్దుల్ ఖాదర్ సాబ్ , మత పెద్దలు అబ్దుల్ మునాఫ్ , అమీర్ సాబ్, రహంతుల్లా,ఇలాహి అబ్దుల్ సలాం,నాగుర్ హుసేన్,సలీం, షహిర్ , షేక్ష, అస్లాం, ఫారూఖ్, షరీఫ్, అత్తర్ రహీం బాష, హైదర్ వలి, అయూబ్ ,తదితరులు పాల్గొన్నారు.