విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ శ్యామ్ సుందర్ , జిల్లా ఎస్పీ పి.జగదీష్ , శ్రీ సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.