విశాలాంధ్ర ధర్మవరం;;; పట్టణములోని ఎన్జీవో హోం నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు సాకే నరేష్ ఆధ్వర్యంలో సమావేశమును నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ యువజన సంఘం కార్యదర్శిగా గోట్ళూరు పవన్ కుమార్ ను నియమించారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చవము అందించి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ బీసీ యువజన సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడతానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీసీ న్యాయవాదుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, ఉపాధ్యక్షులు కురుబ మహేష్, కార్యదర్శి అశోక్ కుమార్, కోశాధికారి కిషోర్ కుమార్, పలువురు ఐక్య విద్యార్థి సంఘం నాయకులు,బీసీ నేతలు పాల్గొన్నారు.