పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయి
విశాలాంధ్ర, కదిరి : మున్సిపల్ పరిధిలో 16వార్డు బేరిపల్లి కాలనీలో వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతున్న పట్టించుకొనే నాధుడు కరువైయ్యారు. వీధులలో ప్రతి కరెంట్ స్థంబానికి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. వీటిని రాత్రి పూట వెలిగేలా ఉదయం కాగానే అర్పి వేయాలి.ఇలా చేస్తే విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా మున్సిపాలిటీకి విద్యుత్ బిల్లులు ఆద చెయ్యచ్చు. వినడానికి చదవడానికి బాగున్నా ఆచరణలో మాత్రం శూన్యం.ఇకనైనా సంభంధిత అధికారులలో మార్పు వచ్చి విద్యుత్ ఆదా చెయ్యాలని కోరుతున్నారు.