విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు క్రీడలను ఆడే విద్యార్థులకు ఆత్మీయ ట్రస్ట్ ధర్మవరం వారి ఆధ్వర్యంలో బాల్ బాడ్మింటన్, క్రీడా సామాగ్రి, బ్యాట్లు, బాల్స్, గెట్రోల్ కిట్టును అందజేయడం జరిగిందని హెడ్మాస్టర్ శైలజా తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ శైలజ మాట్లాడుతూ ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు 30 సంవత్సరాల నుండి సేవలను అందిస్తూ, క్రీడల పట్ల మక్కువ కలిగి, వివిధ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఆత్మీయ ట్రస్టు ప్రతినిధి రామిరెడ్డి ఎస్. జయ చంద్రారెడ్డి, ఎస్. సూర్యప్రకాశ్ రెడ్డి విద్యార్థులకు క్రీడా సామాగ్రి ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడపై మరింత అభ్యసనా శిక్షణ ఇచ్చి రాష్ట్ర జాతీయ స్థాయిలో విద్యార్థులు ఎదిగే విధంగా ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర కృషి చేయాలని వారు కోరారు. క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం పట్ల హెడ్మాస్టర్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు ట్రస్ట్ వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ పండిట్ వేణుగోపాల్, ఉపాధ్యాయులు ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, సునీతమ్మ, లలితమ్మ, లీలావతి, హరికృష్ణ, రామాంజనేయులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.