విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణం లోనిస్థానికే.హె చ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోని మహిళా సాధికారిక శాఖ కో- ఆర్డినేటర్ – ఎస్. చిట్టెమ్మ ఆధ్వర్యంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని ” శక్తి- వన్ సాఫ్ సెంటర్ స్కీమ్ “గురించి విద్యార్థినులకు చైతన్యం కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఐ. సి.డి.ఎస్ – వన్ స్టాఫ్ సెంటర్ నుండి కౌన్సిలర్ అయిన కరిష్మా, పారామెడికల్ విభాగానికి సంబంధించి రమా జ్యోతి హాజరయ్యారు . అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్ధినిలను, మహిళలను ,పిల్లల అభివృద్ధిని వేగవంతం చెసే ,లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వన్ స్టాఫ్ సెంటర్ల ను దేశ వ్యాప్తo గా ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళ ల పై జరిగే వేధింపులు, స్త్రీ వివక్ష నుంచి రక్షణ కల్పించేందుకు కృషి చేయడం, గృహ హింస, పని చేసే ప్రాంతాల్లో మహిళల లు వేధింపులకు గురి అంతే సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడం ,18 లోపు వయసున్న బాలికలు : 18 ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న మహిళల లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి అవసరమైన సహకారాన్ని అందించడం , బాధితులకు 5 రోజుల పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేయడం, వసతి పొందిన రోజుల్లో అవసరమైన ఆహారాన్ని, మందులు, ఇతర సౌకర్యాలను ఉచితంగా కల్పించడం వంటి అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బాధిత మహిళలు నేరుగా సెంటర్ వెళ్ళి ఫిర్యాదు చేయడం ద్వారా గానీ, స్థానికంగా వుండే అంగన్వాడీ సీబ్బంది సహకారం తో గానీ ఫిర్యాదు చేసేందుకు అవకాశం వుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక విభాగం కో- ఆర్డినేటర్ డా. ఎన్ చిట్టెమ్మ, డా॥ బి . త్రివేణి , డా . ఎస్ .షమీఉల్లా , డా. బి. గోపాల్ నాయక్, ఎ.కిరణకుమార్, ఎం.భువనేశ్వరి, యం. పుష్పావతి, బి. ఆనంద్, టి. సరస్వతి.. . తది తర బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. .