విశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యం లో జిల్లా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ లో పొగాకు పదార్థాల వాడకం మీద నిషేధ కార్యక్రమాలని జిల్లా పొగాకు నియంత్రణా అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా లోని ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటినీ పొగాకు పదార్థాల సేవన రహితంగా మార్చాలని వైద్య ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం ఈ కార్యక్రమాన్ని 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ అనంతపురము సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
జిల్లా పొగాకు నియంత్రణ సోషల్ వర్కర్ &డీసీఎం బి . శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ ప్రక్కల,పొగాకు సంబంధించిన దుకాణాలను, కార్యాలయ ఆవరణలో బీడీలు సిగరెట్లు గుట్కా, పాన్ పరాగ్,కైని జర్దా, మొదలగు పదార్థాలను నిషేధించడం జరిగిందన్నారు. దీనికి సంబందించిన గోడ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు.
సి ఒ టి పి ఏ యాక్ట్ -2003 చట్టం ప్రకారం,బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 200 రూపాయలు జరిమానా విధిస్తారన్నారు. అలాగే18 సంవత్సరాల లోపు పిల్లల చేత సిగరెట్ మరియు పొగాకు ఉత్పత్తులు, అమ్మ రాదు వారిచేత అందించరాదన్నారు. విద్యాసంస్థలకు 100 గజాల లోపు, పొగాకును నిషేధించడం జరిగిందనీ అతిక్రమించిన వారు శిక్షర్హులన్నారు. అనంత జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ను పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి ప్రతి ఒక్కరు చేతులు కలపాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రాన కార్యక్రమ సామజిక కార్యకర్త, మరియు 4 వ పట్టణ పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.