– రాష్ట్ర BC న్యాయవాదుల కన్వీనర్ సాకే నరేష్ డిమాండ్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన బిసి న్యాయవాదుల సంఘం శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు మేకల రామాంజినేయులు, ఉపాధ్యక్షులు కురుబ బన్నీల మహేష్, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, కోశాధికారి కిషోర్ కుమార్, ప్రచార కార్యదర్శి బిల్లే నరేంద్ర ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో ఉన్న బీసీ న్యాయవాదులకు 3 సెంట్లలో స్థలం కేటాయించి, ఇళ్ళు మంజూరు చేయాలని, అలాగే ప్రభుత్వం పిపి, ఏజిపి, ఏపీపీ, ల పోస్టుల కేటాయింపులలో బీసీ లకు సమూచిత స్థానం కేటాయించాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఏకగ్రీవంగా పూర్తి స్థాయి జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షులు గా మేకల రామాంజినేయులు,
ఉపాధ్యక్షులు కురుబ బన్నీల మహేష్,
ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్,
కోశాధికారిగా కిషోర్ కుమార్,
ప్రచార కార్యదర్శిగా బిల్లే నరేంద్ర తో పాటు పుట్టపర్తి, హిందూపూర్, పెనుకొండ, కదిరి, మడకశిరలోని 36 మంది న్యాయవాదులతో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ న్యాయవాదుల సంఘం కన్వీనర్ సాకే నరేష్, సత్య సాయి జిల్లా అధ్యక్షులు మేకల రామాంజినేయులు, ఉపాధ్యక్షులు కురుబ బన్నీల మహేష్, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, ప్రచార కార్యదర్శి బిల్లే నరేంద్రతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.