విశాలాంధ్ర- చిలమత్తూర్ రూరల్ (శ్రీ సత్య సాయి జిల్లా) : చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి గ్రామపంచాయతీలోని యగ్ని శెట్టిపల్లి గ్రామంలో సోమవారం డాక్టర్ తేజస్విని ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు, ఈ సందర్భముగా గ్రామంలోని ప్రజలను ప్రజా నిధులను సమావేశపరిచి పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతలపై అవగాహన కల్పించారు, అనంతరం గ్రామంలో ఉచిత వైద్యం అందించేందుకు ప్రజలకు ఇంటింటికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వైద్యం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,తెలుగుదేశం పార్టీ నాయకులు మంజునాథ స్వామి, గోపీనాథ్ స్వామి, రంగస్వామి, సత్యనారాయణ, రమేష్ ,గంగాధర్ ,మల్లికార్జున, వేణుగోపాల్ , శివ, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.