విశాలాంధ్ర ధర్మవరం;; పాటశాలల కళాశాలల యొక్క బస్సులు పూర్తి కండిషన్లో ఉండాలని, అప్పుడు మాత్రమే విద్యార్థులను పిలుచుకొని రావాలని, బస్సు కండిషన్ లేకుండా రోడ్డుపైన తిప్పితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు విధించబడునని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణములో పలు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆకస్మికంగా అతనికి చేశారు. ఇందులో భాగంగా బస్సులలో ఎఫ్ సి, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, టాక్స్ లేని మూడు బస్సులను వారు తనిఖీ చేస్తూ కేసులను నమోదు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు పరిమితులు లేకుండా తిరగడం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, అలా గాకుండా చట్ట ప్రకారం మాత్రమే బస్సులు నడపాలని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజ్ బస్సులకు అన్ని రకముల సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. బస్సు కు సంబంధించినటువంటి ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోయినా బస్సును సీజ్ చేసి, కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.