మానస నృత్య కళాకేంద్రం
విశాలాంధ్ర ధర్మవరం:: ఈ నెలలో కొన్ని రోజుల కిందట కలకత్తాలోని ఓ మహిళ డాక్టర్ మృతి అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేయడం దారుణమని, అటువంటి నిందితున్ని కఠినంగా కోర్టు వారు శిక్షించాలని పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం గురువు మానసతో పాటు పలువురు శిష్యులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో వారు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సంతాపాన్ని తెలిపారు. అనంతరం మానస మాట్లాడుతూ అందరి జీవితాలలో వెలుగును నింపే డాక్టర్ జీవితంలో, చీకటి నింపిన నీచులు మధోన్మాదులు ఆకృత్యానికి నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీ ఎస్బిఐ కాలనీ నుంచి కళా జ్యోతి వరకు చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొని, తమ బాధను వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మహిళలకు రక్షణ భద్రత లాంటి విషయంలో దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు దేనిని తెలిపారు. నిర్భయ చట్టాలు, దిశా చట్టాలు ఉన్నా కూడా మహిళలు దాడులకు, హత్యాచారాలకు గురికావడం దురదృష్టకర మణి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.