విశాలాంధ్ర- ధర్మవరం ; ధర్మవరంలో ఇటీవల జరిగిన సంఘటనలో ఇరువురుపై కేసులో నమోదు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఇలాంటి సంఘటనలు పునరావతమైతే ఎవరిని ఉపేక్షించాం అని తెలిపారు.చట్టం దృష్టిలో అందరూ సమానమే నని వారు స్పష్టం చేశారు.ధర్మవరం పట్టణంలో రెండు రోజుల క్రితం ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న సంఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇరువురుపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ధర్మవరం పట్టణంలో మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పరంగా అన్ని చర్యలు చేపట్టామన్నారు. పట్టణంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా
పోలీస్ బలగాలను, ఏర్పాటు చేశామన్నారు. పోలీసు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ చట్టం ప్రకారమే వెళ్తామని,చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నారు. ప్రజాప్రతినిధులు సైతం సంయమనంతో వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.