టిడిపి నాయకులు సంద రాఘవ
విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ యువర్ స్కూల్ గేమ్స్ లో స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ సాధించిన అక్షయ అనే విద్యార్థి స్థానిక ఆదిత్య స్కూల్లో ఆరవ తరగతి చదువుతూ మైనస్ 23 కేజీల విభాగంలో పాల్గొని ప్రతిభను ఘనపరిచింది. అదేవిధంగా నాలుగవ కలో ఇండియా ఉమెన్స్ నేషనల్ వీఎన్కే ఇండోర్ స్టేడియం కేరళలో మైనస్ 28 కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ కు సిల్వర్ మెడలో గవ్వల యువ సంధ్య సాధించడం గర్వకారణం అని తెలిపారు. ఈ అమ్మాయి స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల టిడిపి నాయకులు సంధ రాఘవ, ఆ బాలికకు నగదు పురస్కారంతోపాటు, అభినందన శుభాకాంక్షలు తో ఆశీస్సులను అందజేశారు. అనంతరం సంధ్యా రాఘవ మాట్లాడుతూ మన ఏపీ స్టేట్ లో గోల్డ్ మెడల్ సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంధ రవి, మాంగల్య సిల్క్స్ అధినేత జింకా పురుషోత్తం, ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్, చిన్నారి తల్లిదండ్రులు, జూడో ఎన్ఎస్ కోచ్ భాష పాల్గొన్నారు.