విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రియాంక నగర కు చెందిన గోవిందప్ప అనే ఉపాధ్యాయుని యొక్క సెల్ ఫోన్ ఇటీవల చోరీకి గురి అయింది. చోరీ జరిగిన వెంటనే ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి ఉపాధ్యాయుడు తన ఇంటి నిర్మాణం కోసం నగదును డ్రా చేసేందుకు యూనియన్ బ్యాంకు కు వెళ్లారు. అక్కడ అసలు విషయం బయటపడడంతో అవాక్కయ్యారు. నగదును డ్రా చేసే విషయంలో బ్యాంకు అధికారులు మీ నగదు బదిలి అయినట్లు తెలిపారు. 13 లక్షల 80,000 నగదు బదిలీ కావడంతో పుట్టపర్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.