విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, గొడవలకు తావు ఇవ్వకుండా ఉండాలని తెలిపారు. బైకులకు సైలెంట్ సార్లు పీకి వేయడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కూడా చర్యలు చెప్పవని తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.