విశాలాంధ్ర- ధర్మవరం:: బీసీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్మవరం లోని సిఎన్బి కళ్యాణమండపమునకు విచ్చేసిన బిజెపి నాయకులు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ను బీసీ సంక్షేమ సంఘం హిందూపూర్ పార్లమెంటు అధ్యక్షులు చక్రధర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు. అనంతరం చక్రధర్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం బీసీ సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా వైద్యము విద్యాపరంగా బీసీలకు అండగా నిలవాలని తెలపడం జరిగిందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆదినారాయణ యాదవ్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నారాయణస్వామి, మనీ, పురుషోత్తం, ఎర్రిస్వామి యాదవ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.