హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయస్థాయి అండర్ 14 జూడో పోటీలకు ధర్మవరం మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలలో యశ్వంత్ 35 కేజీల విభాగంలో, విక్రాంత్ 40 కేజీల విభాగంలో, అఫ్జల్ మహారాజ్ 50 కేజీల విభాగంలో (బంగారు పతకం) ప్రథమ స్థానం సాధించడం జరిగిందన్నారు. ఎంపికైన ఈ విద్యార్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గుజరాత్లో జరిగే జాతీయస్థాయి జూడో పోటీలకు వెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం తో పాటు ఫిజికల్ డైరెక్టర్, పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు తమ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.