విశాలాంధ్ర- ధర్మవరం ; తిరుమల లడ్డు మహా ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా 11 రోజులు పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా, ఆ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక్కం మధుసూదన్ రెడ్డి పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి దీక్షను చేపట్టడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవరు కూడా క్షమించకూడదని తెలిపారు. తిరుమల పవిత్రతను అపవిత్రము చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కోరడం జరిగిందని తెలిపారు.