విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కోర్టు ఆవరణంలో న్యాయవాదుల బార్ అసోసియేషన్, స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని గత నాలుగు రోజులుగా షటిల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించబడ్డాయి. షటిల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ఇడప బత్తిని ప్రసాద్, పెద్దన్న విన్నర్స్ గా, రాఘవేంద్ర, బాబా, సీనియర్ న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్, నూర్ మహమ్మద్, కృష్ణయ్య, గోపికృష్ణ ధనస్సుగా విజేతలు అయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కరీం ఆధ్వర్యంలో విన్నర్స్ కు రన్నర్స్ కు బహుమతులను ప్రధానం చేశారు. విజేతలు మాట్లాడుతూ సెటిల్ టోర్నమెంట్ లాంటి క్రీడలు కోర్టు ఆవరణలో నిర్వహించడం, మాకెంతో సంతోషంగా ఉందని తెలుపుతూ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.