వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి
విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందుగల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా కళాశాల నందు వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి,కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వచ్ఛత పక్షోత్సవాలలో భాగంగా కళాశాల నందు తమ జీవితంలో తాము విలువనిచ్చే అత్యంత విలువైన వస్తువు అనే అంశం మీద వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు గాంధీ జయంతి నాడు బహుమతులను ప్రధానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఎన్ ఎస్ ఎస్ పి ఓ హర్షవర్ధన్, కళాశాల ఏవో రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.