Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ప్రకృతి వ్యవసాయంపై వర్కుషాప్ నిర్వహణ

తక్కువఖర్చుతో అధికదిగుబడి ప్రకృతివ్యవసాయంతోనే సాధ్యం:
జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్

విశాలాంధ్ర,పార్వతీపురం:, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని జిల్లా వ్యవసాయఅధికారి కె.రాబర్ట్ పాల్ తెలిపారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాలతో మండల వ్యవసాయ అధికారులుకు, ప్రకృతి వ్యవసాయ సహాయకులు, సిఎన్ ఎఫ్ సిబ్బందికి వ్యవసాయశాఖ,రైతు సాధికార సంస్థలు సంయుక్తంగా జిల్లా స్థాయి వర్కుషాపును నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పాల్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన లాభాలు, సాగు విధానాలు, నవధాన్యాలు జల్లుట వలన కలిగే ఉపయోగాలను , తక్కువ ఖర్చుతో అధిక దిగబడి సాధించే విధానం తదితర అంశాలపై వర్కుషాప్ లో వివరించారు.
ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయఅదికారి రాబర్ట్ పాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఈనెల 9న విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్కుషాప్ నిర్వహించారని, ఈ వర్కుషాప్ ద్వారా తెలుసుకున్న విషయాలను మండలంలో గల వ్యవసాయ సహాయకులకు తెలియజేయాలని తెలిపారు. రైతులను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా వ్యవసాయ విధానాలు రూపొందించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చు,రాబడి వివరాలు నమోదుచేయాలని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణం పెంచాలని, ప్రతి రైతుసేవాకేంద్రాల పరిధిలో కనీసం ఒక ఎకరా భూమిలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలన్నారు. ప్రతి సంవంత్సరం సాగు విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్లాలని, అయిదు సంవత్సరాలలో కనీసం 40 శాతం ప్రకృతి వ్యవసాయం విధానాలలో సాగుచేసే విధంగా కృషిచేయాలని తెలిపారు. ప్రస్తుతం రసాయనాల ద్వారా సాగుచేస్తున్న పంటలలో మనిషికి కావలసిన రోజువారీ పోషకాలు తగ్గిపోయాయని, వాటిని భర్తీ చేయాలంటే ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారానికి రెండు రెట్లు మాంసాహారం, మూడు రెట్లు పండ్లు, అయిదు రెట్లు ఆకుకూరలు,కూరగాయలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారన్నారు. పోషకాలు అందక వ్యాధినిరోధకత, శరీర పటుత్వం తగ్గిపోవుట వలన త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రోగ్రాం మేనేజరు పి.షణ్ముఖరాజు వర్కుషాప్ లో వివిధ అంశాలను వివరిస్తూ ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యమైన భూమిని, ఆరోగ్యమైన పంటని సాధించి తద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో భూమిని దున్నకూడదని, ఎప్పుడూ భూమిపై పచ్చదనం ఉండేలా చూడాలని తెలిపారు. భూమి సారవంతమగుటకు నవధాన్యాలను భూమిలో, పండ్లతోటలమద్యన జల్లాలని తద్వారా భూమిలో ఆరోగ్యవంతమైన బాక్టీరియా వృద్ది చెందుతుదని తెలిపారు. భూమిలో తేమశాతం పెరుగుతుందని, భూమి గుల్లబారుతుందని, వానపాములు వృద్ది చెంది సారవంతమౌతుందని తెలిపారు. రసాయనాలు, పురుగు మందులు వాడకం తగ్గించే విధంగా రైతులలో అవగాహన కల్పించాలని, తద్వారా పెట్టుబడివ్యయం తగ్గుతుందన్నారు. నవధాన్యాల పంటను పశువులకు దాణాగా వినియోగించుకోవచ్చునని, తద్వారా వాటికి కూడా కావలసిన అన్నిపోషకాలు అంది నాణ్యమైన పాలను అందిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పెంచిన చెట్లఆకులు నీటిని పీల్చుకొనే గుణం కలిగిఉంటాయని, రసాయనాలు వాడిన చెట్ల ఆకులలో ఆ సామర్ద్యం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. ఎల్లప్పుడూ ఏదో ఒక పంట దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ క్షేత్రాలను రూపొందించాలని, తద్వారా ఏడాది పొడవునా రైతుకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఎరువులు, రసాయనక మందులు వినియోగం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం పండించే విధంగా కృషి చేయాలన్నారు. ఏ రకమైన ఎరువులు, రసాయనక మందులు వాడుకుండా ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలు యొక్క ఉపయోగాలను ప్రజలకు తెలియాలన్నారు. కరపత్రాలు, పుస్తకాలు, వీడియోలు ద్వారా ప్రకృతి వ్యవసాయం సాగును పెంచేందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు.
ఈకార్యక్రమంలో పార్వతీపురం ఏడిఏ టి. వెంకటేష్, కె. శ్రీనివాస్, డి. భరత్, పాలకొండ ఏ డి ఏ కె. రత్నకుమారి, సాలూరు ఏ డి ఏ యం.మధుసూదన్,
జిఎల్ పురం ఏడిఏ నిర్మలాజ్యోతి,15మండలాల మండల వ్యవసాయ అధికారులు, కమ్యూనిటీ సహజ వ్యవసాయాన్ని నిర్వహించించే అన్ని క్యాడర్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img