విశాలాంధ్ర- ధర్మవరం:: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లోని సాయి ఆరమం ఫంక్షన్ హాల్లో ఇటీవల ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జిల్లా కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా విచ్చేశారు. మానస నృత్య కళా కేంద్రం వారు ప్రదర్శించిన మహిషాసుర మర్దిని అనే పాటకు మానస మహిషాసుర మర్దినిగా వేషధారణతో పాటు తొమ్మిది మంది చిన్నారులు ఆ పాటకు వేసిన నృత్యాలు అందరూనీ ముగ్దుల్ని చేసింది. తదుపరి మానసతోపాటు శిష్య బృందమైన శ్రీ గౌరీ, వైష్ణవి, సాహిత్య శేఖర్, కీర్తి శ్రీ, హేమశ్రీ, యశస్విని, లిసికా సాయి దుర్గ, లిఖిత, అనూష లను అభినందన శుభాకాంక్షలు అందరిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సత్కరించారు. తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో మానస భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా కృషి చేయడం పట్ల ప్రత్యేకంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మానస తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.