Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కార్పొరేట్ స్థలాలకు కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

దగ్గుపాటి వెంకట ప్రసాద్ కు సిపిఐ నగర్ సమితి వినతి

విశాలాంధ్ర- అనంతపురం : కార్పొరేట్ స్థలాలకు కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని అనంత అర్బన్ దగ్గుపాటి వెంకట ప్రసాద్ కు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిపిఐ నగర్ సమితి నగర కార్యదర్శి ఎన్. శ్రీరాముల, నగర సహాయ కార్యదర్శులు బి. రమణయ్య, అల్లిపీరా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
అనంతపురము నగరంలో వున్న ప్రధానమైన సమస్యల్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాము. వీటన్నిటికి వెంటనే పరిష్కరించవలసినదిగా కోరుతున్నామన్నారు.
1) అనంతపురము నగరంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు పేద ప్రజలు ఆసుపత్రిలో ఓ.పిలో చూపించుకోవడానికి 2000 నుండి 2500 మంది వరకు వస్తుంటారు. వారికి సరైన వైద్యం అందించాలంటే ఆసుపత్రికి ప్రస్తుతం వున్న 750 పడకలకు గాను 500 పడకలు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. మందుల కొరత, డాక్టర్ల కొరత, పారామెడికల్ సిబ్బంది కొరత, ప్రసూతి వార్డులో పడకల కొరత ఇటువంటి అనేక ప్రధానమైన సమస్యలతో ప్రభుత్వ వైద్యశాల కొట్టుమిట్టాడుతోంది అని పేర్కొన్నారు . వెంటనే పేద వారికి మెరుగైన వైద్యం అందించాలంటే 1000 పడక ఆసుపత్రిగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించాల్సిందన్నారు.
2) ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గత టిడిపి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు కేటాయించి 150 కోట్లు వెచ్చింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో 36 మంది డాక్టర్లకు గాను, 15 మంది మాత్రమే వున్నారు. వారితోనే జిల్లా నలుమూలల నుండి వచ్చే పేద వారికి సరైన వైద్యం అందడం లేదు. తద్వారా పేదవారి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షల రూపాయలు అప్పుచేసి వైద్యం కొనే పరిస్థితి వచ్చిందన్నారు . ఈ ఆసుపత్రికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి డాక్టర్ పోస్టులను, పారా మెడికల్ పోస్టులు భర్తీ చేసి పేద వారికి వైద్యం అందించాలన్నారు.
3) అనంతపురం నగరంలో కార్పొరేషన్ స్థలాలు కబ్జాకు గురౌతున్నాయిఅన్నారు. ఆర్టీసి బస్టాండ్ వద్ద సెంట్రల్ పార్కు స్థలం 1/2 ఎకరా స్థలం కబ్జాకు గురైనది. దాదాపు 100 కోట్ల నుండి 150 కోట్ల విలువైనవి గతంలో సిపిఐ పార్టీ వల్లన పూర్వపు కమీషనర్ పి.వి.ఎన్.ఎస్.మూర్తి ప్రత్యేకమైన సర్వే టీమ్ ఏర్పాటు చేసి, సర్వే చేయడంజరిగిందన్నారు. ఇంతవరకు ఆ సర్వేను బహిర్గతం చేయలేదు. పై స్థలములో నిర్మించిన కట్టడాలను తొలగించలేదుఅని పేర్కొన్నారు. ఈ స్థలమునకు సేఫ్టీ వాలు మంజూరు అయినా నిర్మించలేదన్నారు . కబ్జాదారుల కన్ను వాటిపైన కొనసాగుతున్నది అన్నారు. అక్రమ కట్టడాలను నిర్మించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. వందల కోట్ల ఆస్తిని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదేవిధంగా నగరంలో శ్రీనగర్ కాలనీ స.నెం. 355 స్థలాలు వై.సి.వి. నాయకులు కబ్జా చేశారు. అక్కడున్న విలువైన స్థలాలను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు . నగరంలో కార్పొరేషన్ స్థలాలకు కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సంతోష్, సీనా, న్యాయవాది శ్రీనివాసులు, పి మున్నాఫ్, ఆర్ సుందర రాజు, సి నాగప్ప, ఈ ప్రసాద్, ఎన్ జిలాన్ భాష, సి కాజా మొయిద్దీన్, ఎస్. పి ఖాజా హుస్సేన్, ఈ. నారాయణస్వామి, ఎస్. జమీర్ భాష, సి. రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img