అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కు సిపిఐ నగర్ సమితి వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : ఎ.పి.యం.డి.పి. పైపులైను ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు అందించాలని అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ కు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిపిఐ నగర్ సమితి కార్యదర్శి ఎన్ శ్రీరాములు, సహాయ కార్యదర్శిలు రమణయ్య, అలిపిరా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనంతపురము నగర పాలక సంస్థ పరిధిలోని గత ప్రభుత్వ హయాంలో మంచినీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే 140 కోట్ల రూపాయలు వెచ్చించి ఎ.పి.యం.డి.పి. పైపులైన్ ద్వారా 50 డివిజన్లకు ట్యాంకులు నిర్మించి నూతన పైపులైన్ ద్వారా నీటిని అందించాలని వర్క్ చేయడం జరిగిందన్నారు. వాటిలో దాదాపు పాతవూరుకు సంబంధించి 18 డివిజన్లకు పైపులైన్ వర్క్ పెండింగ్లో ఉందన్నారు. న్యూటౌన్ ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్నారు. పాతూరు ప్రజలకు మాత్రం 2 రోజులకు ఒకసారి నీరు అందించడం జరుగుతోందన్నారు.
అనంతపురము నగరంలో చిన్నపాటి వర్షాలకు రాజురోడ్డు, సుభాషేరోడ్డు, గుల్జార్పేట, కమలానగర్ కాలువలు నిండి మురికినీరు రోడ్లపైకి పారుతూ నగర వాసులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు . అండర్గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు .
అనంతపురము నగరంలోని మార్కెట్ యార్డు వద్ద గల చెత్తకు నిప్పు పెట్టడం వల్ల ప్రతిరోజు పొగ, దుమ్ముధూళితో అక్కడ ప్రజలు శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారన్నారు . ఆ పొగ వలన గతంలో రోడ్డు కనిపించక ఆర్టీసి బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్ అయ్యి 6 మంది చనిపోవడం జరిగిందన్నారు. గత వై.సి.పి. ప్రభుత్వం అక్కడి చెత్తను 27 కోట్ల రూపాయలు వెచ్చించి సైక్లింగ్ చేసి అలాగే డంపింగ్ యార్డును తరలిస్తున్నామని చెప్పి, పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు అన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ యార్డు అక్కడ నుండి తరలించాలని కోరడం జరిగిందన్నారు.
అనంతపురము కార్పొరేషన్లో గత మూడు సంవత్సరాల కాలంలో రోడ్లు, కాలువలు, మొక్కలు,
కుక్కలు ఆపరేషన్ పెద్దఎత్తున వందల కోట్ల అవినీతి జరిగిందని కార్పొరేషన్లో వున్న వై.సి.పి కార్పొరేటర్లు,
వై.సి.పి. పార్టీ డిప్యూటీ మేయర్ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. వై.సి. పి. ఎమ్మెల్యే, ఎం.పి సమక్షంలో
వాదులాడుకోవడం చూడడం జరిగిందన్నారు.
వాటిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మరి ఒకసారి కోరడం జరిగిందన్నారు .ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సంతోష్, శ్రీన, లాయర్ శ్రీనివాసులు, పి మున్నాఫ్, ఆర్ సుందర రాజు, సి నాగప్ప, ఈ ప్రసాద్, ఎన్ జిలాన్ భాష, సి కాజా మొయిద్దీన్, ఎస్. పి ఖాజా హుస్సేన్, చాంద్ భాష, ఈ. నారాయణస్వామి, ఎస్. జమీర్ భాష, సి. రమణ తదితరులు పాల్గొన్నారు.