విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని జిగ్గా రామాంజనేయులు తనకున్న పలుకుబడితో జెట్లూమ్స్ లాంటి మిషనరీ ఏర్పాటు చేసి కార్మికుల పొట్ట కొడుతున్నారని సిపిఎం నాయకులు ఎస్హెచ్. భాష, మారుతి, పెద్దన్న ఐయూఫ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జింకా రామాంజనేయులు తనకున్న పలుకుబడితో 100 కోట్ల చేనేత ప్రాజెక్టును దక్కించుకొని తద్వారా నిబంధనలను పాటించడం లేదని అక్రమాలకు తెరలేపి కార్మికులను మోసం చేయడం జరిగిందని తెలిపారు. జింక రామాంజనేయులు నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. దాగుడుమూతలు అవసరం లేదని వారు తెలిపారు. మీ ఫ్యాక్టరీ వద్దకు పరిశీలన నిమిత్తం వ్యక్తులు వస్తే ఎందుకు అనుమతించడం లేదని వారు తెలిపారు. ప్రజా సంఘాలుగా మేము ఫ్యాక్టరీ కి వస్తామని, గత నెల రోజులుగా మీ ఫ్యాక్టరీలో సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే అందులో ఎటువంటి చీరలు తయారు చేస్తున్నారో బయటపడుతుందని తెలిపారు. చీరల తయారీలో స్థానికులా ..ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారా.. అనే విషయాలు కూడా బయటపడతాయని తెలిపారు. నేడు ఇలాంటి వ్యక్తుల వల్ల చేనేత పరిశ్రమ పూర్తిగా చితికిపోయిందని అన్నారు. పవర్లూమ్స్ ఉండడం వల్ల చేనేత కార్మికులు జీవనోపాధిని కోల్పోతున్నారని తెలిపారు. పవర్ లూమ్స్ స్థానంలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన చెట్లు లాంటివి ఏర్పాటు చేసి చేనేత కార్మికులను నిర్వీర్యం చేయడం జరుగుతోందని వారు తెలిపారు. రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని, చేనేత కార్మికులను మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. మరి జింక చలపతి ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్ లో నాకు ఎటువంటి సబ్సిడీలు రాలేదు అంటున్న సదరు యజమాని అందుకు సంబంధించిన జీవోలు చూపాలని వారు డిమాండ్ చేశారు. మీ అవినీతి అక్రమాల సామ్రాజ్యాన్ని బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుత జ్యువలరీ శాఖ మంత్రి సవిత వెంటనే ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా వద్దని తెలిపారు. జింక రామాంజనేయులు చేస్తున్న అక్రమాలపై కలెక్టర్కు ధర్మవరం ఆర్డీవోలకు కలసి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. అంతేకాకుండా వారి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.