విశాలాంధ్ర- ధర్మవరం: నృత్య కళలను ప్రోత్సహించాలని రాప్తాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ శ్రీహర్ష పేర్కొన్నారు.అనంతపురం పట్టణంలో కళాకారుల కాలనీ నందు గణేశ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ ఉత్సవ వేడుక నందు ధర్మవరం కి చెందినటు వంటి మానస నృత్య కళా కేంద్రం వారి బృందం పాల్గొనడం జరిగింది. మొత్తం 15 మంది చిన్నారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం నందు గురువు మానస “దేవి స్తుతి ” అనే అంశాన్ని దాదాపు 15 నిమిషాలు పాటు నృత్యం చెయ్యడం అక్కడి ప్రజలను, భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాప్తాడు సీఐ టీవీ శ్రీహర్ష హాజరయ్యారు. గురువు మానస ని రాప్తాడు సీఐ చేతుల మీదుగా సత్కరించారు. మానస గురువును ఉద్దేశించి హర్ష మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఇటువంటి కార్యక్రమాలను 10 మందికి నేర్పించడం నిజంగా అభినందనీయమని తెలుపుతూ మానసను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శిష్య బృందం: శాన్వి స్వరూప్,
.అనూష, కీర్తి శ్రీ ,తేజోమయి,
చందన, సోమశేఖర్, దీప్తి
సాదియ, శ్రీ గౌరీ, శ్రీ హిత,
రోహిణి, హేమ శ్రీ, రిషిక ,
తనుశ్రీ పాల్గొన్నారు.