నాట్య గురువులు. నటరాజ కృష్ణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని సాంస్కృతిక మండలి లో ఈనెల 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా కేంద్రం ధర్మవరం వారిచే రంగ ప్రవేశములో భాగంగా 8 మంది చిన్నారులచే నాట్య ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు గురువు నటరాజ కృష్ణమూర్తి, స్థానిక గురువు కీర్తన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూచిపూడి కళా కేంద్రంలో రంగ ప్రవేశం నాట్య కోర్సులో 8 మంది చిన్నారులు రెండు సంవత్సరాలు శిక్షణ పొందారు. ఈ రంగ ప్రవేశం నాట్య కోర్సు పూర్తి అయిన సందర్భంగా వారి ప్రతిభను ప్రదర్శించేందుకే ఈ నాట్య ప్రదర్శనను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమం నటరాజ కృష్ణమూర్తి-అనంతపురం వారిచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మరో 30 మంది చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని వారు తెలిపారు. సాంస్కృతిక మండలి వ్యవస్థాపకులు సత్రశాల ప్రసన్నకుమార్ కూడా ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. రంగ ప్రవేశం నాట్య కోర్సులో కోమల శ్రీ, చైత్ర ప్రణవి, దర్శిత, చరిత, పుష్పలత, పూజిత, లక్ష్మీ చౌదరి, లహరి,(8 మంది) శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈనాటి ప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఫోక్ నాట్య ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కావున పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల ప్రజలందరూ ఈ నాట్య ప్రదర్శనను తిలకించి, తమ ఆశీస్సులను అందజేయాలని వారు కోరారు.