Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దేవాంగ సంక్షేమ సంఘం సేవా కార్యక్రమాలు అభినందనీయం

కళ్యాణమండపంలో ఏసీలను ప్రారంభించిన గవి మఠం ఉత్తరాధికారి

విశాలాంధ్ర, ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల పట్ల ఉరవకొండ గవి మఠం దేవస్థానం ఉత్తరాధికారి కర్రీ బసవ రాజేంద్ర స్వామి అభినందనలు తెలియజేశారు. శనివారం స్థానిక దేవాంగ కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన ఏసీలను స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్వాహకులు పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయాలను అందించడం, ప్రతిభ కలిగిన విద్యార్థులను అభినందిస్తూ వారిని ప్రోత్సహించడం, సీనియర్ చేనేత కార్మికులకు సన్మానాలు చేస్తూ చేనేత వృత్తిని గౌరవించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన కళ్యాణమంటపాన్ని పేద, మధ్యతరగతి ప్రజలు కూడా వినియోగించుకునేందుకు తక్కువ ధరలుకు అద్దెలకు ఇవ్వడం హర్ష నియమన్నారు. భవిష్యత్తులో కూడా దేవాంగ సంక్షేమ సంఘం నిర్వాహకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. అంతకుముందు స్వామీజీ దేవాంగ కళ్యాణమంటపం నిర్మాణానికి విలువైన స్థలాన్ని దానం చేసిన మిడతల కరియప్ప విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెంగలి మహేష్, కళ్యాణ మండపం నిర్వాహక సభ్యులు నిమ్మల వెంకటరమణ, మిడతల చంద్రమౌళి, వెంకటస్వామి, విశ్వనాథం, ముక్కెర బాలచంద్ర, వేల్పుల శ్రీనివాసులు, దత్తాత్రేయ, పత్రాల బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img