విశాలాంధ్ర ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) హైదరాబాదులో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కూచిపూడి కళా వైభవం కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యాచార్యులు బాబు బాలాజీ శిష్యులు 12 మంది పాల్గొన్నారు. ఈ గిరీష్ రికార్డ్స్ ను భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించి, దాదాపు 5000 మంది అంతర్జాతీయ స్థాయిలో వివిధ కళా నృత్యకారులు పాల్గొన్నారు. ఇంతటి పెద్ద ఎత్తున మహా బృంద నాట్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చినట్లు ఆరి కర్డ్ ప్రతినిధి తెలిపారు. ఇందులో శ్రీ లలిత నాట్య కళానికేతన్ తరఫున 12 మంది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సాధించడం మాకెంతో సంతోషాన్నిచ్చిందని గురువు బాబు బాలాజీ తెలిపారు. ఆ 12 మందిలో రామలాలిత్యా, సర్వశ్రీ, హృ, వేద ప్రజ్ఞ ,తను లత, ఉమా ప్రియ, వైష్ణవి, అదిత్రి, జాహ్నవి, లీలా మాధవి, ఉదయశ్రీ, సహస్రాలు చేసిన నృత్యం అందరినీ ఆకట్టు కుంది. అనంతరం బాబు బాలాజీ మాట్లాడుతూ ఈ నృత్య గిన్నిస్ రికార్డు వేడుకల్లో ఒకేసారి 3,782 మంది కళాకారులు ఏడు నిమిషాల పాటు లయబద్ధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ లో చోటు చేసుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఈ ప్రదర్శన చూపుర లను మంత్రముగ్ధులను చేసిందని వారు తెలిపారు. రాష్ట్ర మంత్రులు కృష్ణారావు, సీతక్క ఈ ప్రదర్శనకు వీక్షించి హర్షద్వనాలు చేశారని తెలిపారు. తదుపరి రిశినాద్ రికార్డును ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు కేవీ రమణారావు, అధ్యక్షురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.