విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా “అట్ హోమ్” అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజుకు విజయవాడలోని రాజ్ భవన్ గవర్నర్ ద్వారా ఆహ్వాన పత్రిక అందినట్లు డిజైనర్ జుజారు నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను డిజైనర్ గా కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని, చీరలపై దేశ నాయకుల, దేవుళ్ళ చిత్రపటాలను కూడా చిత్రించడం జరిగిందని తెలిపారు. ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో అంపయ్య చేతుల మీదిగా ఈ ఆహ్వాన పత్రికను అందుకోవడం జరిగిందని తెలిపారు. గవర్నర్ ఇచ్చే విందుకు నన్ను ఆహ్వానించడం పట్ల వారికి కృతజ్ఞతలను తెలుపుతున్నానని తెలిపారు. ఇందులో భాగంగా చేనేత కార్మికుల సమస్యలను, చేనేత పరిశ్రమను ఆదుకునే విధంగా గల వివరాలను గవర్నర్ కి వినతి పత్రంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని, చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ యొక్క కష్టాలను తెలపడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పించిన అందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. డిజైనర్ నాగరాజుకు గవర్నర్ విందుకు ఆహ్వానం పట్ల పలువురు చేనేత కార్మిక నాయకులు, పట్టణ ప్రముఖులు, చేనేతలు వర్షం వ్యక్తం చేశారు