విశాలాంధ్ర ధర్మవరం: హాకీ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో ఈనెల 9 వతేదీ నుండి 19 వ తేదీ జరుగు 14వ పురుషుల జాతీయ జూనియర్ హాకీ పోటీలలో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం క్రీడాకారులు మహబూబ్ బాషా, మహమ్మద్ రఫీ, ఎంపిక కావడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ బంధనాదం సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి క్రీడలోనూ నైపుణ్యం సంపాదించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. తదుపరి ఎంపికైన క్రీడాకారులకు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ,బంధనాతం సూర్య ప్రకాష్, హాకీ సత్యసాయి జిల్లా గౌరవాధ్యక్షులు. బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్ , హాకీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు బీ.వీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, ఉడుముల రామచంద్ర,గౌరీ ప్రసాద్ , మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న,జాయింట్ సెక్రెటరీ అరవింద్ గౌడ్, చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్ , సీనియర్ క్రీడాకారులు ఊకా రాఘవేంద్ర, అమునుద్దీన్ , కిరణ్ సత్యసాయి జిల్లా హాకీ కోచ్ హసేన్ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.