విశాలాంధ్ర ధర్మవరం:: హైదరాబాద్ యూసుఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో మెగా సీఎం కరాటే కప్పును ధర్మవరం కరాటే విద్యార్థులు సాధించడం జరిగిందని మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ కరాటే మాస్టర్ భాష తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గోల్డ్ మెడల్స్ 3 సిల్వర్ మెడల్స్ 5 బ్రాంచ్ మెడల్స్ 6 కలిపి 14 మెడల్స్ ను మెగాకప్పుగా ఆదుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఈ విద్యార్థులను అభినందించడం జరిగింది. మొత్తం కరాటే విద్యార్థులు ఏడు మంది పాల్గొనగా ఇర్షాద్ బ్లాక్ బెల్ట్ కటావిభాగంలో సిల్వర్ మెడల్, అలానే కుమిటే విభాగంలో సిల్వర్ మెడల్, అబూబకార్ బ్లాక్ బెల్ట్ కటావిభాగంలో సిల్వర్ మెడల్, కుమతి విభాగంలో బ్రాంచ్ మెడల్, ఎస్ ప్రణవ్ కటా విభాగంలో గోల్డ్ మెడల్ కుమతి విభాగంలో సిల్వర్ మెడల్, సర్విన్ రెడ్డి కటావిభాగంలో గోల్డ్ మెడల్, కుమిత విభాగంలో సిల్వర్ మెడల్, పి అనీఫ్ ఖాతా విభాగంలో సిల్వర్ మెడల్ కుమిటే విభాగంలో బ్రాంచ్ మెడల్, ఏం సాయి ఈశ్వర్ కటాలో బ్రాంచ్ మెడల్, ఎస్ మహమ్మద్ అజాం కటావిభాగంలో సిల్వర్ మెడల్ కుమ్మితే విభాగంలో బ్రాంచ్ మెడల్స్ సాధించడం జరిగిందని తెలిపారు. ఈ విద్యార్థులందరూ కూడా కరాటే డో ఇండియా చైర్మన్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా మెడల్స్ ప్రశంసా పత్రాలు అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.