విశాలాంధ్ర -ధర్మవరం;; పట్టణంలోని రాజేంద్రనగర్ లోని వృద్ధాశ్రమంలో బెంగళూరుకు చెందిన గండ్లూరి వెంకటరాముడు జయమ్మ-మనవడు రమణ, శ్రీలక్ష్మి కుమారుడు చిరంజీవి ఈశాన్ కార్తికేయ మూడవ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని అనాధలకు బెడ్షీట్లు, అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన కుటుంబంలో జరిగే శుభకార్యాలను పురస్కరించుకొని ఇలాంటి అనాధశ్రమంలోని వారికి మానవతా విలువలు పెంచేలా సేవా కార్యక్రమాలు చేపట్టినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు, కుటుంబంలో సంతృప్తి, సంతోషం ఉంటుందని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమ నిర్వాహకులు దాతలకు ఆశ్రమం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.