15 వ వార్డులో టిడిపి అధ్యక్షులు పరిసే సుధాకర్ అధ్వర్యంలో పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం : దేశం మొత్తం హర్ గర్ తిరంగ కార్యక్రమానికి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు అని,అదే విధంగా ఆ కార్యక్రమానికి సంఘీభావంగా పట్టణములోని 15 వార్డు లో టిడిపి పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. నాయకులు పళ్ళెం కృష్ణ జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్ విచ్చేశారు.పళ్ళెం కృష్ణ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఇంటి మీద కట్టీ మన దేశభక్తి ని తెలిపి మన జెండా గౌరవాన్ని తెలియజేయాలి అని చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తకి నాయకులకు జాతీయ జండాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో వార్డు టిడిపి నాయకులు అంబటి సనత్,యంబ అంజి,భరత్,గిర్రాజు ఆనంద్,పొట్ట ప్రసాదు,నాగరాజు,రాము, శివ,జయ గణేష్ ,ఇస్మాయిల్, త్రిలోక్, పోతలయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.