యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈనెల 14వ తేదీ శనివారం యుటిఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అనగా స్వర్ణోత్సవ సంబరాలు సందర్భంగా ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులకు జిల్లా సాయి క్రీడా పోటీలను శ్రీ సత్య సాయి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు సెట్టిపీ జయచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మహిళా క్రీడా పోటీల్లో షటిల్, షాట్ పుట్, త్రో బాల్, స్పీడ్ వాక్, టెన్నికాయిట్ అను క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. టోర్నమెంట్ కన్వీనర్లుగా యుటిఎఫ్ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహిర్ వలి, సుబ్బారెడ్డి, మహిళా విభాగంలో మానస, అనిత నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ సెల్ నెంబర్కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. సెల్ నెంబర్ 9030944717 కు గాని 9441370702 కు గాని సంప్రదించాలని తెలిపారు.