Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

పాఠశాల కమిటీ ఎన్నికల్లో రాజకీయ రంగు పడేనా.?

కమిటీ నియమాలు జరిగేనా.? లేక రాజకీయం సాగేనా ,?
విశాలాంధ్ర : మండల వ్యాప్తంగా నేడు పాఠశాల చైర్మన్ ఎన్నికల్లో రాజకీయ రంగు పడేనా, కమిటీ నిర్ణయాలు జరిగేనా, లేక రాజకీయం సాగేనా అంటూ మండల్ వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు, మండల వ్యాప్తంగా 75 పాఠశాలలు, 5 జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు, కేజీబీవీ ఒకటి ఉన్నాయి. ఈ పాఠశాలలలో చైర్మన్ పదవులను అధికారులు సజావుగా జరిపేరా లేక రాజకీయ రంగు పడనుందా అనే విషయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు చైర్మన్ పదవులను నియమించి పాఠశాల అభివృద్ధికై కృషి చేయాలని ఉద్దేశంతో ఎన్నికలు ఉంటాయని పలువురు గుసగుసలాడుతున్నారు. అయితే చైర్మన్ పదవులకు పోటీ చేసేవారికి రాజకీయ రంగు పూసి, వాటి లబ్ధి కోసం పోటీ పడితే పాఠశాలల ప్రతిష్టకు భంగం కలుగుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యముగా పాఠశాలల్లో విద్యాభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగు తున్న తరుణంలో విద్యార్థి దశలో నే రాజకీయ రంగు పడితే, వారి భావితరాలకు, భారత పౌరులుగా తీర్చిదిద్దే గురువులు ఎటు వైపు మొగ్గు చూపుతారో నేడు తెలుస్తుంది. జరగబోయే చైర్మన్ ఎన్నిక విద్యార్థుల తల్లిదండ్రులక, రాజకీయ నాయకుల కా ఎవరికి ఇవ్వాలి బాబోయ్ అంటూ తల పట్టుకొని దిక్కు తోచని స్థితిలో ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తుంది , కాగా అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికే జై అనే సంస్కృతి అలవాటైపోయింది, ఈ నేపథ్యంలో రాజకీయ రంగు ముసుగులోనే చైర్మన్ పదవులు జరిగేటట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ నేడు జరిగే చైర్మన్ పదవులను అధికారులు రాజకీయ నాయకుల కను సైగులలో ఆడుతారా లేకపోతే కమిటీ నియమ నిబంధనలు కు కట్టుబడి ఎన్నికల జరుపుతారా వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img